ఈనెల 21 వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరగబోతున్నది.  తెలంగాణా ప్రజల కల సాకారం కాబోతున్నది.  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు మొదటి ప్రధానిని ఆహ్వానించాలని అనుకున్నారు.  అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.  


మరి ఏమైందో ఏమో తెలియదుగాని, సడెన్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కెసిఆర్ ప్రధానిని ఆహ్వానించలేదు.  పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ప్రధానిని ఆహ్వానించడం లేదు అనే దానిపై కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి.  


రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి బలంగా మారాలని పావులు కడుపుతున్నది.  తెరాస పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకుంటే.. బీజేపీ .. తెరాస కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తనలో కలుపుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది.  ఈ కారణంగానే మోడీని ఆహ్వానించలేదని కొందరి అభిప్రాయం. 


మోడీ బీజేపీ పార్టీ నేత కదా.  మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నది.  అలాటప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎందుకు ఆహ్వానించింది.  కారణం ఏంటి.. కాళేశ్వరం బ్యారేజీకి నీళ్లు మహారాష్ట్ర నుంచి రావాలి. అందుకోసమే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కాళేశ్వరం ఓపెనింగ్ కు పిలిచారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: