ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు. ఈ రెండు పార్టీలు ఒకరి తరువాత ఒకరు అధికారాన్ని సొంతం చేసుకున్నారు.  ఐదు సంవత్సరాల వ్యవధిలో రెండు పార్టీలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయాయి.  రెండు పార్టీల మనుగడ ప్రశ్నర్ధకంగా మారే పరిస్థితి వచ్చింది. 


2014లో రాష్ట్రాన్ని విభజించడంతో... ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  ఇప్పటి వరకు కాంగ్రెస్ అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  ఈ ఓటమి తరువాత కాంగ్రెస్,మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా అదే సీన్ రిపీట్ అయ్యింది.  


భవిష్యత్తులో గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని చెప్పొచ్చు. 2014లో తెలంగాణాలో కాంగ్రెస్ కొంతమేలు.  కొంతమొత్తంలో సీట్లు గెలుచుకుంది.  అయితే, కాంగ్రెస్ నుంచి గెలిచిన కొంతమంది నేతలు తెరాస లోకి జంప్ అయ్యారు. 


2019 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి.  19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. 12మంది తెరాస లోకి జంప్ కాగా, ఆ పార్టీకి 6గురు మాత్రమే మిగిలారు.  అందులో నలుగురు మరో జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.  తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగె ఉన్నది.  తెలంగాణాలో 2014లో 15 వరకు సీట్లు గెలుచుకున్నా... అందరు తెరాస లో చేరిపోయారు. 

2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకుంది. గెలిచిన సండ్ర వీరయ్య తెరాస లో చేరిపోయారు.  ఇటు ఆంధ్రప్రదేశ్ లో 2014లో అధికారంలోకి వచ్చిన పార్టీ 2019 కి వచ్చే సరికి మరింత బలహీనపడి కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది.  ఇందులో 16 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: