తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా కావాలంటే అలా పంచుకున్నారు.  ఏది కావాలంటే దాని సొంతం చేసుకున్నారు.  ప్రాజెక్టులు తెచ్చుకున్నారు.. అందులో వాటాలు పుచ్చుకున్నారు ఇలా ఒకటికాదు రెండు కాదు ఎన్నో.. 2019 లో అన్ని తలక్రిందులయ్యాయి.  తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలం అయ్యింది.  


ఇలా ఘోరంగా విఫలం కావడానికి బాబే కారణం అని పైకి చెప్పకపోయినా లోపల తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  వీటిని బయటపెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చోస్తున్నారు.  ఈ అవకాశం ఇప్పుడు సుజనాచౌదరికి వచ్చింది.  గతంలో సుజనా చౌదరి.. ఎన్డీఏ లో సహాయమంత్రి గా పనిచేశారు.  


ఆంధ్రప్రదేశ్ లో ఒక బలహీనమైన పార్టీని విమర్శించడం వలనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఇండైరెక్ట్ గా చెప్పాడు.  డైరెక్ట్ గా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీ బీజేపీని పక్కన పెట్టడం.. ఆ పార్టీని విమర్శించడం వలనే టీడీపీ ఓడిపోయిందని చెప్పకనే చెప్పాడు.  అదే మోడీతో కలిసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నాడు సుజనా.  


సుజనా చౌదరి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయంపై ఆరా తీయగా.. తనకు టీడీపీ ని వదిలివెళ్లే ఆలోచన లేదని.. ఒకవేళ వదిలి వెళ్లి బీజేపీలో చేరాల్సి వస్తే.. బాబుకు చెప్పిన తరువాతే వెళ్తానని అన్నారు.  అంటే సుజనా మనసులో ఆ ఆలోచన ఉందని స్పష్టంగా తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: