ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడని బాబు ఏనాడూ అనుకోలేదు.  అనుకోకుండా అవకాశం లక్ష్మి పార్వతి రూపంలో కలిసి వచ్చింది.  వచ్చిన అవకాశాన్ని బాబు అలా వినియోగించుకున్నారు.  ముఖ్యమంత్రి కాగలిగారు.  ఇది జగమెరిగిన సత్యమే.  కానీ, బాబును ఎవరు పల్లెత్తు మాట అనలేదు. కారణం ఏంటి.. ?


అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే లక్ష్మి పార్వతి సపర్యలు చేసింది.  దగ్గరుండి చూసుకుంది.  ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది.  తనకు సపర్యలు చేసిన లక్ష్మిపార్వతికి ఒక స్థానం కల్పించాలని అనుకున్నాడు.  ఆమెను వివాహం చేసుకున్నాడు.  


పార్టీలో ముఖ్యమైన విషయాలను ఆమెకు అప్పగించారు.  ఇది కొంతమందికి నచ్చలేదు.  ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ఒక్కటిగా చేసిన బాబు, ఇలాగే వదిలేస్తే.. టీడీపీ లక్ష్మి పార్వతి చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి.. పార్టీని కైవసం చేసుకున్నారు. 


లక్ష్మిపార్వతిని ఉదాహరణ చూపించి టీడీపీ పార్టీని ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నాడని లక్ష్మి పార్వతి కుమారుడు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ పేర్కొన్నాడు.  తన తల్లి వల్లనే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని అన్నాడు.  ఒకవేళ లక్ష్మీపార్వతి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తుంటే.. దానికి అడ్డుకట్ట వేసే మార్గం వేరే ఉంటుందని.. ఇలా చేయడం తగదని ఆయన చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: