జెసి దివాకరరెడ్డి ఎప్పుడూ తన దూకుడుతో నోటి దురుసుతో వార్తల లో నిలుస్తూ ఉంటారు.ఈసారి ఆయన బరిలోకి  దిగకుండా తన కుమారుడు పవన్ అనంతపురం ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దింపారు.ప్రజలు తమకే పట్టం కడతారు అనుకున్నారు. తనొక్కటి తలిస్తే దైవం మరొక్కటి తలుస్తుంది అన్నటు తన కుమారుడు ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం బీజేపీ ఆంధ్రా లో రెండవ స్థానానికి రావడానికి ప్రయత్నిస్తుంది. దాని కి అనుగుణంగా రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ మరియు ఓడిపోయిన టీడీపీ, జనసేన అభ్యర్ధులను తమ పార్టీ లో చేర్చుకునే దిశగా సంప్రదింపులు జరుపుతుంది.వారిలో జెసి పేరు కూడా ఉంది.

అలాంటి జెసి తను పార్టీని వీడబోయేది లేదని కుండబద్దలు కొట్టేశారు.అలాగే బీజేపీ వారు తమ పార్టీలోని కొందరు ప్రముఖ నాయకులను తమతో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.నిన్నటి దాకా జగన్ శిబిరంలో కి తమ పార్టీ నాయకులను వెళ్ళకుండా కాపు కాసిన టీడీపీకి తను పార్టీలోకి ఎవరినీ తీసుకోబోమని ప్రకటించిన జగన్ హామీ కొద్దిగా ఊరట కలిగించింది.

ఇలాంటి సమయంలో జెసి దివాకరరెడ్డి లాంటి సీనియర్ నేత ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం తో మరోసారి తమ నాయకులను బీజేపీ లోకి వెళ్ళకుండా ఉండేందుకు కాపు కాసుకోవల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: