కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఏఐటీయూసీ అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని  ఈ పోరాటాలను కార్మికలోకం ప్రజానీకం బలపరచాలని ఎఐటియుసి నేతలు పిలుపునిచ్చారు.  సామర్లకోట ఆంజనేయస్వామి గుడి నుండి జూన్ 20 ,21 తేదీలలో పెద్దాపురం లో జరగనున్న  ఏఐటీయూసీ  జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు పిలుపు నిచ్చారు .


కార్మికవర్గ పోరాటాలకు ప్రజలు జయప్రదం చేయాలని కోరుతూ రోడ్డుమార్గాన జోల పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ప్రథమ కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆయన కొనియాడారు .99 సంవత్సరాలుగా కార్మిక వర్గాల కోసం ,కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అని వారన్నారు .ఈ జిల్లాలో సంఘటిత ,అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం వారికి అండగా ఉంటూ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు .


పెద్దాపురం డివిజన్ ఏరియా లో అనేక కార్మిక సంఘాలను నెలకొల్పిన చరిత్ర ఏఐటీయూసీ కి ఉందని అన్నారు .అందుకనే ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని వారు కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: