Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:42 am IST

Menu &Sections

Search

టీడీపీ గోపీలు ప‌ది మంది... వైసీపీ ప‌క్కా లెక్క‌లు ఇవే..!

టీడీపీ గోపీలు ప‌ది మంది... వైసీపీ ప‌క్కా లెక్క‌లు ఇవే..!
టీడీపీ గోపీలు ప‌ది మంది... వైసీపీ ప‌క్కా లెక్క‌లు ఇవే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరంగా ఓడిపోయిన ఆయన వైఖరిలో ఎంత మాత్రం మార్పు రాలేదని శాసనసభ సమావేశాల రెండో రోజునే అర్థమైపోయింది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు రెండో రోజే స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు, సంప్రదాయాలను తుంగలో తొక్కడం చూసిన ప్రజ‌లు ఎవరు హర్షించలేదు. కనీసం స్పీకర్ ఎన్నిక సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాలను కూడా పాటించక పోతే ఎలా అన్న ప్రశ్న సగటు పౌరుడు నుంచి కూడా వచ్చింది. 


ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా వైసీపీ నేతలు టిడిపి నుంచి పలువురు తమ పార్టీలోకి గోడ దూకడానికి రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు తమతో నేరుగా టచ్‌లో ఉన్నారని... ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. ఇక ఇప్పుడు అంబటి రాంబాబు వంతు వచ్చింది. చంద్రబాబును ఇంత దారుణంగా ప్రజలు తిరస్కరించినా ఆయన తీరులో ఎంత మాత్రం మార్పు రావడం లేదని... ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీగా ఉన్నారని మరో బాంబు పేల్చారు. 


చంద్రబాబు ఇదే తీరుతో ఉంటే తెలుగుదేశం పార్టీ బలం త్వరలోనే 23 నుంచి 13కి పడిపోతుందని కూడా అంబటి చెప్పారు. చంద్రబాబు వ్య‌వ‌హార శైలీతో తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలు అసహ్యించుకునే తీరు వచ్చేసిందని... అందుకే ఆయనను ఘోరంగా ఓడించారని, ఆయన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఆ పార్టీ బలం మ‌రో 10కి పైగా మైన‌స్ అవుతుంద‌న్నారు. టిడిపి ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తొస్తుందని కూడా అంబటి ఎద్దేవా చేశారు.


ఏదేమైనా తొలి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టిడిపిపై అధికార వైసీపీ ఎమ్మెల్యేల ఎటాక్ కంటిన్యూ అవుతూ వస్తోంది. మొత్తానికి ఎనిమిది నుంచి పది మంది టిడిపి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఏదేమైనా ఈ వార్త తెలుగుదేశం అభిమానులు కూడా తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తోంది.


ysrcp-perfect-calculations-on-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ర‌విప్ర‌కాష్ న‌యా ప్లాన్‌... టీవీ 9కు పెద్ద దెబ్బ..!
అసెంబ్లీ ఎఫెక్ట్: బాబుకు ఫాలోవ‌ర్ల సూచ‌న ఇదే
పూరి - ఛార్మీపై కేసుకు రెడీ... క‌మెడియ‌న్ సంచ‌ల‌నం
టీడీపీకి కాపులు దూరం... ఏపీలో ఏం జ‌రుగుతోంది...!
అమ‌రావ‌తికి ప్ర‌పంచ బ్యాంకు బై బై... తెర‌వెన‌క ఏం జరిగింది...
విక్ర‌మ్ ' మిస్ట‌ర్ KK '  ఫ‌స్ట్‌ షో టాక్‌... హిట్టా... ఫ‌ట్టా
అమ‌లాపాల్ ' ఆమె ' ఫ‌స్ట్ షో టాక్‌... హిట్టా... ఫ‌ట్టా
చిరు 153లో ఆ కుర్ర హీరో ..!
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌... రికార్డుల వ‌ర్షం
తేజ‌కు నితిన్‌కు అక్క‌డే చెడిందా...
ప‌వ‌న్ వ‌చ్చింది డ‌బ్బుల కోస‌మేనా... ప‌వ‌ర్‌స్టారా... ఫెయిడ్ స్టారా...!
ద‌య‌నీయ స్థితిలో మాజీ మంత్రి... పార్టీ నేత‌ల‌కు ప‌ట్ట‌దా...!
ఆగ‌ని కేశినేని ట్వీట్లు... ఇంత పెద్ద వ్యూహం ప‌న్నాడా...
జ‌గ‌న్ న‌యా డెసిష‌న్‌పై బాబులో టెన్ష‌న్ ఎందుకో...
వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ లేడీ ఎమ్మెల్యే
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ టాక్‌... పూరి - రామ్‌ ఖాతాలో మ‌రొక‌టి
బాల‌య్య‌కు అక్క‌డ పార్టీ ప‌గ్గాలు ఇస్తారా... పార్టీ గ‌తేంటో...!
ఏపీపై కేంద్రం `గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌`
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... టార్గెట్ ఎంతంటే...
ప్ర‌భాస్ షాక్‌తో యంగ్ హీరో గిల‌గిలా...
అనిల్ రావిపూడిపై జ‌గ‌ప‌తిబాబు ఆగ్ర‌హం... మ‌హేష్‌కు షాక్‌
అఫీషియ‌ల్‌: చిరు - ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌కు నిర్మాత ఖ‌రారు
టీడీపీలో కొత్త పంచాయితీ.... ఈ సారి విశాఖలో వార్‌
హెరిటేజ్‌కు దెబ్బ మీద దెబ్బ‌... షేర్ మార్కెట్లో ఢ‌మాల్‌
టాలీవుడ్‌కు బిగ్ షాక్‌:  ' సాహో ' రిలీజ్ వాయిదా..
సూప‌ర్ షాక్‌: పార్టీ మారాల‌ని టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం ప్రెజ‌ర్‌...
టీవీ 5  - మ‌హాటీవీ @ రూ.300 కోట్లు
గుంటూరు టీడీపీలో బిగ్ వికెట్ డౌన్ ... డీల్ ఓకే చేసిన రామ్‌మాధ‌వ్‌
వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ‌హేష్ మ‌న‌సు గెలిచిన జ‌ట్టు ఏదంటే...
ఇ ' స్మార్ట్ ' క్రేజ్‌.... ఫ‌స్ట్ డే బుకింగ్స్ ర‌చ్చ రంబోలా...
ఇస్మార్ట్‌కు ఏ ... ప‌చ్చిబూతులు... ఎక్స్‌పోజింగ్‌... ఇంత ఘోరంగానా...
ఐసీపీ టీమ్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్‌క‌ప్‌... భార‌త్‌కు షాక్‌
ఒకే ఫ్రేమ్‌లో సీఎం జ‌గ‌న్‌తో ఎన్టీఆర్‌.. బాల‌య్య‌
ప్ర‌పంచ‌క‌ప్‌లో టామ్ లాథ‌మ్ న‌యా రికార్డు
కీవీస్ పాలిట ఆ క్రికెట‌రే విల‌న్‌... అత‌డి వ‌ల్లే క‌ప్ పోయింది
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.