టీడీపీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఓటమి గురించి ఇప్పటీకే ఓపెన్ గా మాట్లాడినారు. జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన కుటుంబం త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ఆయనే స్వయంగా బీజేపీ విషయమై క్లారిటీ ఇచ్చేశారు. 'నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను.. నన్నెవరు బీజేపీలోకి రమ్మని అడుగుతారు.?' అంటూ అమాయకంగా ఎదురు ప్రశ్నించారు జేసీ దివాకర్‌రెడ్డి.


అదే సమయంలో, టీడీపీ నేతలు కొందరు బీజేపీతో టచ్‌లో వున్నారని జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ ఉలిక్కిపడింది. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ సీట్ల పరంగా ఘోర పరాజయాన్ని చవిచూసినా, ఓట్ల పరంగా మరీ అంత దారుణ పరిస్థితిని అయితే ఎదుర్కోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ తర్వాత టీడీపీనే.. ఇంకో పార్టీ ఇప్పట్లో టీడీపీ స్థాయికి ఎదగడం కూడా దాదాపు అసాధ్యం.


అయినాగానీ, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలని నేతలు అనుకోవడమేంటి.? ఎటూ, వైఎస్సార్సీపీలోకి సదరు నేతలకు ఎంట్రీ లేకపోవడంతోనే.. వేరే దారి లేక బీజేపీని ఎంచుకుంటున్నారన్నమాట. పోనీ, ఎంతో కొంతమంది అయినా టీడీపీని వీడి, బీజేపీలో చేరొచ్చుగాక. అలా చేరినవారు, రాజకీయంగా బీజేపీలో నిలదొక్కుకోగలరా.? ఎన్నికల్లో పోటీచేస్తే గెలవగలరా.? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అయినాగానీ, టీడీపీని కాదనుకుని బీజేపీలోకి వెళుతున్నారంటే.. టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అంతలా దిగజారిపోయిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: