తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తి  దయనీయంగా ఉంది.  దశాబ్దాల తెలంగాణ  కల నెరవేర్చినా..  తెలంగాణ ఓటర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ని  కరుణించడం లేదు.   2014లోనూ,  2019లోను తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న కాంగ్రెస్  కల నెరవేర లేదు.

 

2019 ఎన్నికల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.   గెలిచింది అతి తక్కువ మంది అంటే..  వారిలో డజను మందికి పైగా  టిఆర్ఎస్ పంచన చేరారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కాపాడుకోవడమే  గగనం అయిపోయింది.

 

అయితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు తనకు ఇచ్చి ఉంటే  పరిస్థితి ఇంత దారుణంగా  ఉండేది కాదని  తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు.   తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా  ఒక్క బీజేపీకే ఉందని ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

 

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టడం వల్లే  పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.  పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు  తనకు అప్పజెప్పాలని  డిమాండ్ చేస్తున్నారు.  మరి కాంగ్రెస్ పెద్దలు  తెలంగాణ పార్టీ పగ్గాలు రాజగోపాల్ రెడ్డి  చేతికి ఇస్తారా..  చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: