జీవితంలో ఏది అంత ఈజీగా దొరకదు.  ఈజీగా దొరికింది అంటే అది నీదగ్గర ఉండదు.  ఏదైనా కావొచ్చు.. ఉద్యోగం కావొచ్చు.. రాజకీయాలు కావొచ్చు.  కష్టపడితే ఉద్యోగం వస్తుంది.  కానీ, రాజకీయాలు అలా కాదు.  నిరంతరం కష్టపడుతూనే ఉండాలి.  నిరాశను దరిచేరనివ్వకూడదు.  

ప్రత్యర్థులకు అవకాశం కల్పించకూడదు. ఎలాగైనా గెలవాలనే తపన ఉండాలి.  అలాంటి తపన ఉన్న వ్యక్తి  స్మృతి ఇరానీ. ధారాళంగా మాట్లాడగలిన వనిత.. అన్ని విషయాలపైనా ఆమెకు అవగాహనా ఎక్కువగా ఉన్నది.  2014లో స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది.  అయినప్పటికీ మంచి పోటీ ఇచ్చింది.  

దీంతో ఆమెను రాజ్యసభ ఎంపీగా చేసి.. మంత్రి పదవి ఇచ్చారు.  మోడీ ప్యానల్లో కీలకమైన వ్యక్తుల్లో స్మృతి ఇరానీ ఇరానీ కూడా ఒకరు. 2019 లో రెండోసారి కూడా స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసి ఏకంగా రాహుల్ గాంధీపై విజయం సాధించింది.  రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయనపై గెలవడం అంటే మాములు విషయం కాదు.  

ఈ ఎన్నికల్లో స్మృతి ఇరానీ సూపర్ విక్టరీ సాధించింది.  పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించిన స్మృతి ఇరానీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చిన సమయంలో... సభలో ఎన్డీఏ సభ్యులు కరతాళధ్వనులతో ఆహ్వానించారు.  మోడీతో సహా అందరు ఆమెను ఇలా అభినందించడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: