అష్టాదశ పురాణాల్లో మహాభారాతాని కి ఓ సముచిత స్థానం ఉన్నది.  ఎలాంటి సమస్యకైనా అందులో పరిస్కారం దొరుకుతుందని ఎందరో రుజువు చేశారు.  అందుకే చాలా మంది మహాభారత గ్రంథాన్ని పఠనం చేస్తుంటారు.  మహాభారతంలోని ఎన్ని ఘట్టాలను తీసుకొని సినిమాలుగా చేసిన సంగతి తెలిసిందే.  

స్వతగాహ కెసిఆర్ పుస్తక పఠన ప్రియుడు. ఎన్నో పుస్తకాలను చదివారు.  అందులో మహాభారతం కూడా ఉన్నది.  రెండుసార్లు మహాభారత గ్రంధాన్ని చదివిన వ్యక్తిగా కెసిఆర్ కు పేరు ఉన్నది.  ఇదిలా ఉంటె ఈరోజు కెసిఆర్ విజయవాడకు వెళ్లారు.  అక్కడ  శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో పాల్గొన్నారు.  

స్వాత్మా నరేంద్ర సరస్వతికి శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షను ఇచ్చారు.  ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు కెసిఆర్ కూడా హాజరయ్యారు.  కెసిఆర్ కు దేవాలయాల పట్ల, పురాణాల పట్ల ఎంతో అవగాహనా ఉందని, మహాభారతం రెండు సార్లు చదివి అర్ధం చేసుకొని ముఖ్యమంత్రైనా ఏకైక వ్యక్తి కెసిఆర్ అని కితాబిచ్చారు స్వరూపానంద స్వరస్వతి.  

హిందుత్వ పార్టీలు సైతం యాగాల గురించి, దేవాలయాల గురించి పట్టించుకోవడం లేదని, కెసిఆర్ వీటికి విరుద్ధంగా యాగాలు చేస్తూ.. దేవాలయాల పరిరక్షణను చేపడుతుండటం  విశేషమని చెప్పారు స్వరూపానంద సరస్వతి.  ఆధ్యాత్మిక పీఠంలోకి రాజకీయాలు ప్రవేశిస్తే.. ముందుముందు ఆ పీఠం పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: