జగన్ అనుభవ రాహిత్యం రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడవదని మొన్నటి వరకు పచ్చ కాకులు పిచ్చి కూతలు కూశాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క విజయంతో తానేంటో రుజువు చేసుకున్నారు జగన్. అపర చాణక్యుడు చంద్రబాబుని ఢీ కొట్టి పడకొట్టిన తరువాత జగన్ పొలిటికల్ ఇమేజ్ ఆకాశానికి తాకింది. జగన్ సాధించిన ఈ విక్టరీని చూసి జాతీయ పార్టీలకే కళ్ళు చెదిరాయి.


ఇవన్నీ ఇలా ఉంటే జగన్ అటు పాలనలోనూ, ఇటు రాజకీయంలోనూ వేస్తున్న అడుగులు ప్రత్యర్ధులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా సాగుతున్న జగన్ వ్యూహం ఎవరికి అంతుచిక్కకుండా తయారైంది. తిరుపతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఏపీలో 2024లో మనమే గెలవాలని పిలుపు ఇచ్చారు. అంటే మోడీ ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీను వైసీపీకి ధీటుగా నిలబెడదామని అనుకున్నారు. 


కానీ జగన్ తన తెలివిని చూపించారు. ఏపీలో ఫిరాయింపులు ఉండవు, మేము ఎవరినీ తీసుకోం, ఎవరైనా తీసుకున్నా వూరుకోం అంటూ అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన సంచలన ప్రకటన బీజేపీకి స్ట్రోక్ లా తగిలింది. ఎందుకంటే ఏపీలో ఫిరాయింపులతోనే జీవం పోసుకోవాలని, 15వ అసెంబ్లీలో ఉనికి కోల్పోయిన తమ పార్టీని ఆ విధంగా మనుగడలో ఉంచుకోవాలని కమలనాధులు పన్నుతున్న వ్యూహాలకు జగన్ చేసిన ఒక్క ప్రకటన తల్లకిందులు చేసినట్లయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: