తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ఆర్థిక వనరులు ఉన్నాయి.  ప్రత్యేకించి అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం తెలంగాణకు ఎనలేని ఆస్తి.  ఇన్ని అవకాశాలు ఉన్నా తెలంగాణకు మాత్రం ఓ లోటు ఎప్పటికీ తీరనిది ఉంది.

 

అదే సముద్రతీరం.  తెలంగాణ   చుట్టూ భూభాగంతో ఉన్న రాష్ట్రం.  సముద్ర తీరం లేకపోవడం వల్ల ఎగుమతులు దిగుమతులు విషయంలో తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  దీనికోసం తెలంగాణ పొరుగు రాష్ట్రాల పై ఆధారపడాల్సి వస్తోంది.

 

తాజాగా జగన్ తో సమావేశమైన కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.  ఆంధ్రప్రదేశ్   ఓడరేవుల నుంచి  తెలంగాణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశం కల్పించాలని జగన్ ను కోరారు.   ఇందుకు జగన్ కూడా వెంటనే  సూత్రప్రాయంగా అంగీకరించారు.

 

ఓడరేవుల అంశంతోపాటు చాల మధ్య రవాణా సౌకర్యాలు విషయం కూడా కెసిఆర్ జగన్ భేటీ లో  ప్రస్తావనకు వచ్చింది.  ఇరు రాష్ట్రాల మధ్య మరిన్ని రైళ్లు,  జాతీయ రహదారులు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ నిర్ణయానికి వచ్చారు.  కేంద్రానికి ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: