ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.  కొత్తప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.  ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.  ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఆదాయ మార్గాలను అన్వేషించాలి.  వీలైనంతగా ఆదాయ వనరులను సృష్టించుకోవాలి.  అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.  


ఏ పరిశ్రమ అయినప్పటికి తన ప్రోడక్ట్ ను బయటకు తీసుకువచ్చే క్రమంలో ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది.  సెలెక్టివ్ గా కొంతమంది స్టార్స్ తో వాటికి ప్రచారం చేయించుకుంటుంది.  ఇదే పనిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతున్నది.  ఆంధ్రపదేశ్ లో అనేక శాఖలు ఉన్నాయి.  ఇందులో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక శాఖలు ముఖ్యమైనవి.  


ఈశాఖలకు స్టార్స్ ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొని ప్రచారం కల్పిస్తే ఆదాయం వస్తుంది. అలాగే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఒకరిని నియమించాలని అనుకుంటోంది.  జూనియర్ ఎన్టీఆర్ ను ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  మరి దీనికి ఎన్టీఆర్ ఒప్పుకుంటారా అన్నది తెలియాలి.  


ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్రపడింది.  2009 లో ఎన్టీఆర్ టిడిపి తరపున పనిచేశారు.  ఆ తరువాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు.  వైకాపాలో ఎన్టీఆర్ మిత్రుడు నాని, మామ శ్రీనివాస్ లు ఉన్నారు.  వాళ్ళు పట్టుబడితే.. ఎన్టీఆర్ ఒప్పుకుంటారని వైకాపా నుంచి అందుతున్న సమాచారం.  మరి ఇది నిజమైతే.. అసలే ఏం చేయాలో పాలుపోక ఉసూరుమంటున్న బాబుకు పెద్ద షాక్ ఇచ్చినట్టే అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: