దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన దగ్గరినుండి మొన్న అధికారంలోకి వచ్చేవరకు ఎన్ని సమస్యలెదురైనా ప్రజాసమస్యలపై తనవంతుగా గట్టిగా పోరాడారు అనే చెప్పాలి. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తోలి ఎన్నికల్లో 67 సీట్లు సాధించిన వైసిపి పార్టీ, ప్రతిపక్ష హోదాలో ఒకింత అధికార పక్షంపై తమ పోరాటం బాగానే చేసిందనే చెప్పాలి. ఇక మొన్నటి 2019 ఎన్నికల సమయంలో ప్రజలు రెండింటి మూడొంతుల సీట్లతో వైసిపి పార్టీకి అధికారాన్ని కట్టపెట్టారంటేనే అర్ధం చేసుకోవచ్చు జగన్ ని ప్రజలు ఎంతలా నమ్మరో. నిజానికి గత ఎన్నికల్లో ఓటమి తరువాత తన లోటుపాట్లపై దృష్టిపెట్టిన జగన్, ఆ తరువాత ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరంపాటు చేసిన యాత్ర కూడా అయన అధికారంలోకి రావడనికి ఒక కారణం అని చెప్పవచ్చు. 

ఇకపోతే గత నెల 30న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జగన్, అక్కడినుండి అధికారులను పరుగులుపెట్టిస్తున్నారు. అంతేకాక ఇప్పటివరకు అందుతున్న వార్తల ప్రకారం తాను సహా మంత్రులెవరూ కూడా ప్రజాధనాన్ని వృధా చేయబోరని, అవసరం మేరకే ఖర్చుపెట్టడం జరుగుంతుందని తన మంత్రిమండలి సభ్యుల వద్ద స్పష్టం చేసారట. అంతేకాక మంత్రుల్లో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తనవద్దకు ఫిర్యాదులు వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వారిని బర్తరఫ్ చేయడం జరుగుతుందని హుకూం కూడా జారీచేయడం జరిగిందట. ఇక పాలన చేపట్టిన మొదటిరోజునునే ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి జగన్, రాబోయే ఈ నాలుగున్నరేళ్లలో తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతనే రాబోయే 2024 ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని అంటున్నారట. దాన్ని బట్టి చూస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు అయన విశ్రమించేది లేదని అర్ధం అవుతుంది. 

ఇక ఇప్పటికే సామజిక పెన్షన్లు, కిడ్నీ బాధితులకు పెన్షన్లు, అంగన్ వాడి వర్కర్ల జీతాల పెంపు, కాంట్రాక్టు వర్కర్ల రెగ్యూలరైజెషన్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగులకు ఇంటెరిమ్ రిలీఫ్, అలానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు వంటి అంశాల అమలుపై దృష్టిపెట్టి, దాదాపుగా అవన్నీ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఈ విధంగా రాబోయే ఈ నాలుగున్నర ఏళ్లలో మరింతగా ప్రజా పాలన పై దృష్టి పెట్టి, దాదాపుగా ఎక్కడా అవినీతి, అక్రమాలు లేకుండా కనుక చూసుకుని, అలానే తమ మానిఫెస్టోలో అతిముఖ్యమైన మధ్య నిషేధాన్ని గట్టిగా అమలు చేయగలిగితే మరొక్కసారి ఆయనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది రాబోయే రోజుల్లో ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: