2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లతో విజయం సాధించింది. కానీ చంద్రబాబు నాయుడు వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తన పార్టీలోకి చేర్చుకున్నాడు. స్పీకర్ కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో వారు రాజీనామా చేయకుండానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అలా వైసీపీ పార్టీని బలహీనపరచిన చంద్రబాబు ఆ పార్టీ ఫిరాయింపుల ద్వారా మాత్రం ఏమీ సాధించలేకపోయారు. 
 
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది . 151 సీట్లతో తిరుగులేని మెజారిటీ సాధించింది. టీడీపీలాగా వైసీపీ ప్రలోభాల పర్వం మొదలుపెట్టకపోయినా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అంటున్నాడు. పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించనని తన పార్టీలోకి వచ్చే వారు రాజీనామా చేసే రావాలని చెబుతున్నాడు. 
 
నిజానికి జగన్ అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని బలహీనపరచవచ్చు. ఇప్పటికే విశాఖ కు చెందిన కొందరు నాయకులు, ప్రకాశంకు చెందిన కొందరు నాయకులు జగన్ ఒప్పుకుంటే పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారు. కానీ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తారా అంటే అనుమానమే. జగన్ మాత్రం పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మనుగడే కష్టమైపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: