అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత నారాలోకేష్ పార్టీ సమావేశాల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. అధికార పార్టీ వైసీపీని విమర్శించడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నాడు. తన ట్వీట్లతో అదికార పక్షంపై విమర్శలు మొదలుపెట్టాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం లోకేష్ ఘాటుగానే జగన్మోహన్ రెడ్డిగారిని విమర్శించాడు. 
 
నారా లోకేశ్ తన ట్వీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైకాపా రౌడీలు జరుపుతున్న డాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనం పరీక్షించవద్దని కోరాడు. గెలుపు అనేది బాధ్యత పెంచటానికే తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని నారాలోకేష్ అన్నారు. 
 
గుంటూరు జిల్లా పిన్నెల్లి గ్రామం రాచవరం మండలంలో రైతులు ఓటు టీడీపీకి వేసినందుకు వైసీపీ నాయకులు గ్రామ బహిష్కరణ చేసారని ఇలా చేయటం ఏమిటని నారాలోకేష్ ప్రశ్నించాడు. నెల్లూరు గాంధీ గిరిజన కాలనీ, వెంకటేశ్వరపురంలలో పేదల గుడిసెలు కూల్చడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారని ఇది మంచి పద్దతి కాదని నారాలోకేష్ అన్నారు.తెలుగుదేశం కార్యకర్తలపై డాడులు చేస్తున్నారు ఇదేనా రాజన్న రాజ్యం అంటూ ప్రశ్నించాడు నారాలోకేష్ 
 



మరింత సమాచారం తెలుసుకోండి: