పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో...17వ లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఎన్నిక‌యేది ఎవ‌ర‌నే అంశంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. స‌భ‌ను న‌డిపించే స‌మ‌ర్థ నేతగా ఓమ్‌ బిర్లా ఎన్నికయ్యే అవకాశం ఉంది. బీజేపీ సీనియ‌ర్ నేత అయిన ఓమ్‌ బిర్లా రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కోట నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.  ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ నియాకమైన విషయం విదితమే. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు వీరేంద్ర కుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా కొనసాగనున్నారు.


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఓమ్‌ బిర్లా కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నారాయణ్‌ మీనాపై 2.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఓమ్‌ బిర్లా 1962, నవంబర్‌ 23న రాజస్థాన్‌లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతల దేవీ దంపతులకు జన్మించారు. ప్రభుత్వ కామర్స్‌ కాలేజీ, కోట నుంచి కామర్స్‌ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓమ్‌ బిర్లా.. అంచెలంచెలుగా ఎదిగారు. 1979లో స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. 1991 నుంచి 12 సంవత్సరాల పాటు భారతీయ జనతా యువ మోర్చాలో కీలక నాయకుడిగా పని చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఇక 2003లో తొలిసారిగా కోట సౌత్‌ నియోజకవర్గం నుంచి రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో కోట నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. తాజాగా అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2.5 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుపొందారు.


మరింత సమాచారం తెలుసుకోండి: