2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు రోజా గారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాక ముందే రోజా గారు జబర్దస్త్ షో న్యాయనిర్ణేతగా ఉన్నారు. జబర్దస్త్ షో కూడా మొదట్లో మంచి కామెడీతోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ షోలో రాను రాను డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ హద్దులు దాటుతోందనే విమర్శలు వస్తున్నాయి 
 
ఇది ఎంతలా శృతి మించిందంటే ఫ్యామిలీతో కలిసి ఆ షో చూడలేని పరిస్థితి. అందులో బూతు కంటెంట్ ఎక్కువైపోతుందనే విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోజా గారు 2019లో నగరి నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవిలో ఉన్నా భవిష్యత్తు మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. 
 
ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న రోజా గారు ఇలాంటి షోలకు న్యాయ నిర్ణేతగా ఉండటం వలన ఎటువంటి లాభం ఉండదు. ఈ షో వలన రోజా గారిని ప్రతిపక్షాలకు కూడా విమర్శించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. రోజా గారు ఈ షోకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయం ప్రజల నుండి కూడా వ్యక్తమవుతుంది. మరి రోజాగారు ఈ ఒక్క పని చేయగలరో లేదో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: