జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ కేసు వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీలో పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలంటూ చంద్రబాబునాయుడు అండ్ కో వాదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి.

 

తన ఐదేళ్ళ కాలంలో మూడు విడతలు మాత్రమే చెల్లించారు.  చివరి రెండు విడతలు చెల్లించాల్సిన మొత్తం రూ. 10 వేల కోట్లు పెండింగ్ లో పడిపోయింది. తాము చెల్లించలేక ఫెయిల్ అయిన బకాయిలను జగన్ ద్వారా కట్టించాలన్నది చంద్రబాబు పట్టుదలగా ఉంది. చంద్రబాబు హామీలను తామెందుకు భరించాలన్నది వైసిపి వాదన.

 

నిజానికి చంద్రబాబు డిమాండ్ లో పసలేదు. అయినా మొదటి నుండి చవకబారు ఆలోచనలతోనే రాజకీయం నడుపుతున్నారు కాబట్టి ఇపుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. తామెంత డిమాండ్ చేసినా జగన్ రుణమాఫీ బకాయిలు కట్టేలా లేడని టిడిపికి అర్ధమైపోయింది.

 

అందుకననే ఈ విషయంలో న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు చంద్రబాబుకు సూచించారు. న్యాయస్ధానం నుడి డైరెక్షన్ ఇప్పిస్తే కానీ జగన్ ప్రభుత్వ పట్టించుకోదని సమావేశంలో నిర్ణయించారు. కాబట్టి రుణమాఫీకి నిధుల విడుదల చేయించేలా  జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన లీగల్ విషయాలపై టిడిపి అధ్యయనం చేస్తోంది.

 

తానిచ్చిన హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ఆ భారాన్ని జగన్ పై రుద్దాలని చూడటమే చాలా చవకబారుగా అనిపిస్తోంది. పైగా తానిచ్చిన హామీని పార్టీ హామీగా చూడకుండా ప్రభుత్వ బాధ్యతగా చూడాలని ఓ పనికిమాలిన సలహా కూడా ఇస్తున్నారు. మరి ఇదే సూత్రం రాజీవ్ ఆరోగ్యశ్రీ  అమలు  విషయంలో  చంద్రబాబు ఎందుకు పాటించలేదో తెలీదు. ఓ పద్దతి ప్రకారం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేసిన విషయం అందరూ చూసిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: