చంద్రబాబు అంటేనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట మాట్లాడితే ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఒక్క మాటనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మూడుసార్లు ముఖ్యమంత్రి,  14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమీక్ష చేసేటప్పుడు ఎలా ? ఉండాలి.. చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు సూటిగా సుత్తి లేకుండా సమీక్షలో చెప్పాలి. ఐదేళ్ల పాటు చంద్రబాబు చూస్తే గంటలకొద్దీ మీటింగ్ తప్ప వాటివల్ల ఉపయోగం లేకుండా పోయింది. 


సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం చంద్రబాబుతో అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే సమీక్షల‌కు అర్ధరాత్రి 12 గంటలు అయినా బ్రేక్ ఉండేది కాద‌ట‌. మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ టైం అయినా చంద్రబాబు వదలక పోవడంతో ఆయన సమీక్షలో పాల్గొన్న ఐఏఎస్ అధికారులకు నీర‌సం వ‌చ్చేద‌ట‌. చాలామందికి లోబిపి, గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఉండడంతో వీరి బాధలు వర్ణనాతీతంగా ఉండేవ‌ట. ఇప్పుడు జగన్ సీఎం అయిన వెంటనే టైం టు టైం షెడ్యూల్ ఫాలో అవుతుండ‌డంతో.. ఐఏఎస్ అధికారుల‌లో ఎక్క‌డా లేని ఆనందం నెల‌కొంది. జగన్ పర్సనల్ టైం, అడ్మినిస్ట్రేషన్ టైం చాలా క్లియర్ గా ఉంటాయ‌ట. 


ఉదయాన్నే నిద్ర లేవటం, కసరత్తులు చేసుకోవడం ఆ తర్వాత కొంత సేపు ఫ్యామిలీతో గడపటం, ఫ్యామిలీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడంతో ఆయన దినచర్య స్టార్ట్ అవుతుందట. అక్కడ నుంచి పరిపాలనపైన ఆయన ప్రధానంగా దృష్టి పెడతారట. ఉదయం 8:30 కే ఆయన ఇంటి నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అక్కడే మూడు గంటల వరకు ఉంటున్నారు. అఫీషియల్ ఫైళ్ళ సంతకాలు, చిన్నపాటి రివ్యూలు చేస్తున్నారు. ఇక ప్రధాన స‌మీక్ష‌లు ఎలాగూ ఉంటున్నాయి. తాజాగా ఎల్‌బిసి మీద రివ్యూ చూస్తే మూడు గంటల్లో కంప్లీట్‌... ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్లిపోవడం... ఆరుగంటల‌
కు పని అయిపోతోంది.


అంటే జ‌గ‌న్ లెక్క ప్ర‌కారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం ఆరుగంటలకల్లా వర్క్ ఫినిష్ చేయాలి. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు కొత్త ప్రభుత్వ నియామకాలు మాత్రమే చూస్తారట. అధికారులు కూడా సచివాలయం నుంచి ఆరు దాటకుండా ఇంటికి వెళ్లిపోవాలని కూడా జగన్ కండిషన్ పెట్టేశారటంటే... అధికారులకు పని పరంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చూస్తున్నార‌ని తెలుస్తోంది. అదే చంద్రబాబు పరిపాలన చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధం. ఇప్పుడు జ‌గ‌న్ టైం టేబుల్ చూసి బాబు కూడా చ‌ర్చించుకుంటున్నార‌ని అధికారులు చెపుతున్నారు.


చంద్రబాబు బయటికి వెళ్ళినా కూడా సాయంత్రం ఐదారు గంట‌ల‌కు సచివాలయానికి వెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తూనే ఉంటారు. దీంతో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే స‌మీక్ష‌లే ఎక్కువ అన్న‌ విమర్శలు అధికారుల్లోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు వారికి జగన్ పరిపాలన అంతా టైం టు టైం ఉండడంతో పాటు తమకు చాలా స్వేచ్ఛ లభించింది అని ఊపిరి పీల్చుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో పోలిస్తే కనీసం మంత్రిగా కూడా పని చేయకుండా సీఎం అయిన జగన్ సంస్క‌ర‌ణ‌ల‌కు అప్పుడే ప్రజామోదంతో పాటు అధికారుల ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: