ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాపట్ల ఎంపీ కోన రఘుపతి నియామకం దాదాపు ఖరారైనట్టే. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయగా, కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను బలపరుస్తూ 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

 

కోన రఘుపతి నియామకం ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఉదయం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏపీ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో, అదే వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అయన పార్టీకి చేసిన సేవలకు గాను ఈ గౌరవ దక్కనుంది.

 

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన రఘుపతి, 2014, 2019లో రెండు సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశేషం ఏంటంటే ఆయన తండ్రి కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా పని చేశారు. ఇది చాల అరుదైన ఘనతనే మనం చెప్పుకోవాలి, ఎవ్వరికో తప్ప, ఇలాంటి అవకాశం అందరికి రాదు.

 

1981 ఫిబ్రవరి 24 నుంచి 1981 సెప్టెంబర్ 22 వరకు ఆయన ఏపీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన, ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. అనంతరం పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రలకు గవర్నర్ కూడా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఏపీల్లో గుంటూరు జిల్లా నుంచి స్పీకర్లుగా పనిచేసిన ఐదుగురిలో కోన ప్రభాకర రావు ఒకరు. ఇది చాల శుభ పరిణామం.


మరింత సమాచారం తెలుసుకోండి: