ఆలు లేదు చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంగతేమో గానీ... రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బస్సులో తీసుకువెళ్లి పోలవరం ప్రాజెక్టు చూపించేందుకే కొన్ని కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా ఖర్చు చేశారు. పోలవరంలో తట్టెడు మట్టి ఎత్తినా దాన్ని కూడా పెద్ద గ్రేట్ ఈవెంట్‌లా సెలబ్రేట్ చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. అసలు ప్రాజెక్టు పూర్తి అవ్వకుండా చంద్రబాబు ఎన్నికలకు ముందు గేట్లు పెట్టేస్తున్నామంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 


ఇక పోలవరం వాక్ గ్యాలరీ అంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫ్యామిలీ మెంబర్లను అందరినీ తీసుకెళ్లి ఒక రోజు చంద్రబాబు అక్కడ పెద్ద హంగామా చేశారు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి వాళ్ళు ఇంకేముంది.. పోలవరం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కావాలంటే పోలవరం వెళ్లి ప్రాజెక్టును చూసుకోవచ్చు అని కూడా చెప్పారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అయితే అసెంబ్లీలో 2018 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తామని... జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పేపర్‌లోనూ, ఛానల్‌లోనూ రాసుకోవచ్చని అసెంబ్లీలో సవాలు చేశారు. 


ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ టిడిపి నేతల కోరిక తీరుస్తున్నారు. కాకపోతే సీఎం హోదాలో కావటం విశేషం. జగన్ పోలవరం సందర్శనకు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించ‌నున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను పోలవరం సందర్శించాలని టిడిపి నేతలు కోరితే... ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ప్రాజెక్టు ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కూడా జగన్ ఇప్పటికే స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో టీడీపీ నేత‌ల గుండెల్లో అప్పుడే రైళ్లు కూడా ప‌రిగెడుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా పూర్తి చేసే క్రమంలో... జగన్ నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: