- డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట తో ఉద్రిక్తత
మాజీ ఎంపీ లు ఇద్దరిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎం పీ వి హనుమంతారావ్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. హైదరాబాద్ లో ఇటీవల డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించిన విషయమై స్థానికంగా అక్కడ దళితులు నిరశన తెలిపిన విషయం తెలిసిందే. 


మంగళవారం ఉదయం 5 గంటలకు పంజాగుట్ట వద్ద అంబేత్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు వి. హనుమంతరావు, హర్షకుమార్ ప్రయత్నించారు. విగ్రహాన్ని తొలగించిన స్థలంలో పునఃప్రతిష్టించేందుకు మాజీ ఎం పీల సమక్షంలో కార్యకర్తలు ప్రయత్నించారు. కాగా పంజాగుట్ట పోలీసులు వారిని నిలువరించారు. 


లారీ లో అంబేత్కర్ విగ్రహాన్ని తీసుకు రాగా లారీ తో సహా విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎం పీలు వి హనుమంతరావు, హర్షకుమార్ లతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా కార్యకర్తలు నిరశన తెలియజేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: