- ధార్మిక సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించే ఆలోచనను విరమించుకోవాలి
వై ఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబెనెట్ సమావేశంలో అనేక తరగతుల చిరుద్యోగి వేతనాలు పెంచుతూ తీర్మానం చేయడాన్ని సిఐటియు స్వాగతిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆశా, ఐకెపి యానిమేటర్లు, పారిశుధ్య కార్మికులు, సిపిఎస్ ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికులు తదితరులు ఎంతో ఊరట కలిగిందని యూనియన్‌ కాకినాడ యూనిట్‌ లీడర్‌ పెద్దెంశెట్టి రామకృష్ణ కొనియాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు కూడా రూ. 1000/- పెంచడం పట్ల యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. 


ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు పెంచిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలతో కలవకుండా నేరుగా వారి వేతనాలకు జత చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామన్న హామీ అమలు చేయాలని సిఐటియు కోరుతున్నది. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ ఆధ్వర్యంలోని అక్షయ పాత్రకు అప్పగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది దురదృష్టకరం, 2003 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు పాఠశాలలో వేడి వేడిగా వండి వడ్డిస్తే విద్యార్థులు తింటున్నారు. 


అక్షయపాత్ర, నవప్రయాప, ఏత్తాశక్తిలాంటి ధార్మిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రలోభపరిచి ఈ పథకాన్ని అనేకచోట్ల  నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది పిల్లలకు ఉచితంగా భోజనం పెడుతున్నామని అంతర్జాలం ద్వారా ప్రచారం చేసుకుంటూ ప్రపంచమంతా చందాలు దండుకుంటున్నారు. ఉప్పు, కారం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కోడిగుడ్డు లేకుండా మన పిల్లల ఆహార అలవాట్లకు భిన్నమైన ఉడికిి, ఉడకని అన్న పెడుతున్నారని ఈ సంస్థలపై ఇప్పటికే తీవ్రమైన విమర్శలున్నాయని గుర్తు చేశారు. ధార్మిక సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించే ఆలోచనను తక్షణం మానుకోవాలని యూనియన్‌ డిమాండ్‌ చేస్తోంది. 
కోరుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: