ప్రత్యేక హోదా పాచిపోయిన చింతకాయ పచ్చడి లాంటిది.  దానికి ప్రాధ్యానత లేదు. కేంద్రం ఇవ్వనని చెప్పేసింది.. ప్రత్యేక హోదా అయినా.. ప్రత్యేక ప్యాజేజీ అయినా ఒకటే అని బాబుగారు గత నాలుగేళ్ళ క్రితం చెప్పారు.  ఆయన చెప్పిన ఆ మాటలను యు టర్న్ తీసుకొని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని బాబుగారు డిమాండ్ చేశారు.  


నాలుగు సంవత్సరాలు కలిసున్న టిడిపి ఆ తరువాత యు టర్న్ తీసుకోవడంతో ప్రజలు కూడా యు టర్న్ తీసుకున్నారు.  వైకాపా విజయం తరువాత, జగన్ .. బీజేపీకి దగ్గరైంది.  మొన్న జరిగిన నీతి అయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.  


ప్రత్యేక హోదా సాధ్యం కాదని అనుకుంటున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆయన వ్యాఖ్యల ప్రమారం.. ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు.  దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని త్వరలోనే ప్రత్యేక హోదా రావడం ఖాయం అని చెప్పడం విశేషం. 


బాబుగారు ఎంత మొత్తుకున్నా కనీసం కనికరించని కేంద్రం, ఇప్పుడు సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందా.. తీసుకుంటే మిగతా రాష్ట్రాలు ఊరుకుంటాయా.. అస్సలు ఊరుకోవు.  ఈ సంగతి అందరికి తెలిసిందే కదా. ఒకవేళ హోదా ఇస్తే దానిపై టిడిపి ఎలా రియాక్ట్ అవుతుంది.  వైకాపా ఎలా చెప్పుకుంటుంది. హోదా ఇచ్చే బీజేపీ దానిని ఎలా ప్రమోట్ చేసుకుంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: