బెజవాడలో నకిలీ నోట్ల కలకలం 
- రూ.100 నోట్లను రూ.3 లక్షల మేర స్వాధీనం చేసుకున్న పోలీసులు
బెజవాడలో ఇటీవల కొంతకాలంలో  గోప్యంగా నకిలీ నోట్ల చలామణి వ్యవహారం సాగుతోంది. ఈ నోట్ల చలామణి వెనుక ఓ ముఠా హస్తముంది. కాగా మార్కెట్‌లో ఈ నోట్లే ఎక్కువుగా ఉండటంతో సామాన్యలు ఏది మంచిది, ఏది నకిలీదనే విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు నకిలీ నోట్ల ముఠా గుట్టును  రట్టు చేశారు. రూ.100 నోట్ల ను ముద్రించి మార్కట్‌లో చలామణి చేస్తున్న ఆ ముఠా ను అదుపులోనికి తీసుకుని ఆరాతీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 


పెద్ద నోట్ల అయితే అనుమానం వస్తుందని వంద రూపాయల నోట్లను ముద్రిస్తూ కొంతకాలంగా ఒక ముఠా చీకటి వ్యాపారానికి తెరలేపింది. వీరు ముద్రించిన నోట్లను చిరువ్యాపారులను టార్గట్‌గా చేసుకుని వారి వద్దనే మార్చుతున్నారు. ఈ క్రమంలో బెజవాడలో ఈ నకిలీ నోట్ల చలామణి పెరగడంతో పాటు ఓ చిరువ్యాపారి సందేహంలో పోలీసులకు సమాచారం అందించగా డెకాయి ఆపరేషన్‌ చేపట్టారు. 
పక్కా సమాచారం అందుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు డెకాయి ఆపరేషన్ చేపట్టారు. యనమలకుదురులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీ ముఠా నుంచి రూ 3లక్షల రూపాయల నకిలీ 100 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆరా తీయగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని టార్గెట్ చేస్తూ... ఈ ఫేక్ రూ 100 నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు వారు పోలీసుల ఎదుట అంగీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: