బుధవారం నుండి ఏపి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు
— రవిశంకర్ అయ్యనార్ , అడిషనల్ డీజీ
 పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలనే సీయం నిర్ణయంపై చర్చలు జరిపామని అడిషన్‌ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ అన్నారు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ ... మొత్తం 19 మోడల్స్ ని ఎంపిక చేశామన్నారు. యూనిట్ ఆఫీసర్స్ ఏదోక మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చని సూచించారు.  ప్రతి యూనిట్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొన్ని రోజులకి మార్పులు చేర్పులు చేస్తామని,  70 వేల పోలీసులకి  ఐటీ ప్లాట్ తయారు చేసి పారదర్శకంగా డాష్ బోర్డ్ అమలులోకి తీసుకురాబోతున్నామన్నారు. 


కానిస్టేబుల్ నుండి ఇన్సిపెక్టర్ స్దాయి వరుకు వీక్లీ ఆఫ్ లు అమలులోకి వస్తుందని,  వీక్లీ ఆఫ్ లతో షిఫ్ట్ డ్యూటిస్ కూడా ఉంటాయన్నారు.  20% ఖాళీలను భర్తిలను చేయబోతున్నట్టు చెప్పారు.  
రాష్ట్రవ్యాప్తంగా 12300 ఖాళీ ఉన్నాయని, కమిటి రిపోర్ట్ లో దీనిపై చర్చించామన్నారు.  విశాఖ, కడప, ప్రకాశంలో ట్రైల్స్ చేశామని, అధికారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని వెల్లడించారు.  ప్రతి రెండు నెలలకొకసారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు.

బుధవారం నుండి ఏపి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలులోకి వస్తుందని చెప్పారు.  వీఐపీ, యాంటి నక్సల్ డ్యూటి కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తి చేస్తామన్నారు.
 అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటామని తెలియజేశారు. పోలీసులకి ఒత్తిడి వల్ల స్ట్రోక్స్ , కిడ్ని , షుగర్ వ్యాదులు ఎక్కువ అవుతున్నాయని,  రిటైర్ అయిన పదిపదిహేళ్లలోనే పోలీసులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే వీఆర్ లో ఉన్నవాళ్లని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా తీసుకుంటామని తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: