ఓడలు బళ్ళు అవుతుంటాయి.. బళ్ళు ఓడలు అవుతుంటాయి.  దీనిని ఎన్నిరకాలుగానైనా వాడుకోవచ్చు.  రాజకీయాల్లోకూడా దీనిని విరివిగా వినియోగించుకోవచ్చు.  2014 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు.  


ఇచ్చిన హామీ అలాగే ఉన్నది.. ఐదేళ్లు గడిచిపోయాయి.  గతంలో హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ చాలు అని బాబుగారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు.  ప్యాకేజీ ఇస్తున్నందుకు సంతోషిస్తామని కూడా చెప్పారు.  చెప్పినట్టుగా అంటా బాగుంది.  


మూడున్నర సంవత్సరాల సహవాసం తరువాత విడాకులు తీసుకున్నారు.  కేంద్రంపై యుద్ధం ప్రకటించాడు.  ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టారు.  బాబుగారి మాటలు  ఎవరు పట్టించుకోలేదు.  ఫలితం.. ఓటమి. 2019 ఎన్నికల్లో వైకాపా 151 స్థానాల్లో విజయం సాధించింది.  


ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి జగన్ వరసగా నిర్ణయాలు తీసుకొని దూసుకుపోతున్నాడు.  మొన్న జరిగిన నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు.   హోదా లేకపోతె రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పకనే చెప్పాడు.  బాబుగారు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటే.. జగన్ మాత్రం ప్యాకేజీ వద్దు.. హోదానే ముద్దు అని చెప్పాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: