అతి ప్రాచీన పీఠం. శారదా పీఠం. ఆధ్యత్మిక చింతనలకు ఆలయం. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆధ్వర్యంలో నడిచిన పీఠం. లోక కళ్యాణం కోసం నిత్యం భగవన్నామస్మరణతో నడిచే పరమ పవిత్ర పీఠం శరదా పీఠం.  ఈ శారదా పీఠం దేశం నలుమూలలా విస్తరించి వుంది.  ఇక్కడవరకు బాగానే వుంది, విశాఖ పీఠాధిపతులైన  శ్రీ స్వరూపానందంద్ర సరస్వతి గారు నేడు పత్రికాముఖంగా వెలిబుచ్చిన అభిప్రాయం తెలుగు రాష్ట్ర ప్రజలను ఆశ్టర్యచకితులను చేసింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది.

అదేమిటంటే జగన్ మోహన్ రెడ్డి గారు సీయం అవ్వాలని శారదా పీఠం మొత్తం 5 సంవత్సరాల నుండి తపస్సు చేసిందట. కృష్ణా తీరంలో శారదపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో ఈ అద్భుతాన్ని వివరించారు సాక్ష్యాత్తు  విశాఖ పీఠాధిపతులైన  శ్రీ స్వరూపానందంద్ర సరస్వతి గారు .  ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవడం విశేషం.   జగన్ గారితో సరిపెట్టకుండా కేసిఆర్ కూడా తమకు ప్రాణసమానుడే అని పీఠాధిపతి కితాబివ్వడం గమనార్హం.  ఓ ప్రాచీన ఆధ్యాత్మిక పీఠం ఓ వ్యక్తి కోసం 5 సంవత్సరాలు తపస్సు చేయడమంటే నిజంగా జగన్ గారు పెట్టి పుట్టారు.  అంటే లోకంలో ప్రజలే కాదు లోకకళ్యాణం కోసం ఆరాటపడే ఆధ్యాత్మిక కర్తలు కూడా జగన్ గారు సీయం అవ్వాలని ఆరాటపడ్డారు.  మరి వారి తపస్సు ఫలితమో, దేవుని లిఖితమో నేడు జగన్ గారు ఆంధ్రప్రదేశ్ సీయం.  తరాలు మారినా చరిత్రలో లిఖించదగ్గ అద్భుతం ఈ విషయం. 

ఆఖరుగా పీఠాధిపతులకో విన్నపం, లోక కళ్యాణం కోసం వ్యక్తిగతంగా ఓ వ్యక్తి కోసం మీ తపస్సు అమోఘం...అదే తపస్సు చేసి మరో అయిదేళ్ళలో ఎవ్వరిని సీయం చేయబోతున్నారో చెబితే చాలా ఖర్చు, శ్రమ తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: