చైనా డ్రాగన్ దేశం.. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటాన్ని ఉవ్విళ్లూరుతున్నది. అందుబాటులో ఉన్న దేశాలను తనవైపుకు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.  చిన్న చితకా దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఆసియా ఖండంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.  


ఇదిలా ఉంటె, నిన్నటి రోజున చైనా అధీనంలో ఉంచుకోవాలని చూస్తున్న హాంకాంగ్ లో ప్రజలు ఉప్పెనలా రోడ్లపైకి వచ్చారు.  దాదాపు 20 లక్షలమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.  దీనికి కారణం ఏంటి అంటే.. హాంకాంగ్ ఓ బిల్లును తీసుకొచ్చింది.  


ఈ బిల్లు ప్రకారం చైనా ఎవరిని ఖైదీలుగా కావాలని అడుగుతుందో వాళ్ళను చైనాకు అప్పగించాలి. అందులో మరో మాట ఉండకూడదు.  60 మంది సభ్యులున్న హాంకాంగ్ పార్లమెంట్ లో 45 మంది బీజింగ్ అనుకూలురు ఉంటారు కాబట్టి బిల్లును ప్రవేశ పెట్టక తప్పలేదు.  


ఈ విషయం తెలిసిన ప్రజలు ఒక్కపాటుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు .  ఈ ఉప్పెన చూసి హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేర్రీలామ్ భయపడిపోయింది.  ఖైదీల అప్పగింత బిల్లును బుట్టదాఖలు చేసింది. 2045 వరకు హాంకాంగ్ పై చైనా అధికారం చెలాయించవచ్చు.  2045 తరువాత ప్రజల అభిప్రాయం మేరకు స్వతంత్రంగా ఉండొచ్చు.  ఇది చైనాకు రుచించలేదు.  అందుకే హాంకాంగ్ లో ఉద్యమాలను నడిపే నేతలను ఖైదీలుగా బంధించాలని   పధకం వేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: