తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత అప్ర‌తిహ‌త విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చారు వైసీపీ నాయ‌కులు. పాద‌యాత్ర కావొ చ్చు, అధికార పార్టీపై వెల్లువెత్తిన ప్ర‌జావ్య‌తిరేక‌త కావొచ్చు.. మార్పే కోరుకుని వుండొచ్చు..ఏదేమైనా.. ప్ర‌జ‌లు ఏపీలో వైసీ పీకి  ప్ర‌జ‌లు అధికారం అప్ప‌గించారు. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతామ‌ని, వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాణ‌న చేస్తామ‌ని ప్ర‌తిన బూనిన జ‌గ‌న్ ఆదిశ‌గానే అడుగులు వేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, తాజాగా తొలి అసెంబ్లీ స‌మా వేశాల‌ను చూస్తున్న వారికి మాత్రం ప‌రిస్థితిలో మార్పు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. 


గ‌తంలో 67 మంది ఎమ్మెల్యే లు ఉన్న‌ప్పుడు త‌మ‌కు స‌భలో ఘోర అవ‌మానం ఎదురైంద‌ని చెప్పుకొచ్చిన వైసీపీ నాయ‌కులు దాని నుంచి నేర్చుకున్న పాఠాలు క‌నిపించ‌డం లేదు. స‌మ‌జంగానే అధికార పార్టీ స‌భ్యుల దూకుడు ఉంటుంది. అయితే, జ‌గ‌న్ ముందుగానే చెప్పిన‌ట్టు తాను సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తాన‌ని చెప్పారు. అయితే, ఈ సంచ‌ల‌నాలు కేవ‌లం పాల‌న‌కే ప‌రిమితం చేయ‌డం త‌గ‌ద‌నేది ప్ర‌జాస్వామ్య వాదుల సూచ‌న. అదే స‌మ‌యంలో స‌భ‌లో హుందాత‌నానికి, సంప్ర‌దాయాల‌కు కూడా విలువ ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చా రు. 


కానీ, తొలి అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన మంగ‌ళ‌వారం నాటి వ‌ర‌కు చూస్తే.. ప్ర‌తిప‌క్షంపై పైచేయి సాధించాల‌నే దూకుడు అడుగ‌డుగునా వైసీపీ నేత‌ల్లో క‌నిపించింది. నిజానికి పైచేయి అనేది ఇప్ప‌టికే వైసీపీ సాధించింది. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో అధికారం సాధించ‌డాన్ని మించిన పైచేయి ఏముంటుంది? 
దీనిని విమ‌స్మ‌రిస్తున్న వైసీపీ నాయ‌కులు స‌భ‌లో టీడీపీని ఎండ‌గ‌ట్టి.. పైచేయి సాధించాల‌ని అనుకోవ‌డం, అత్యంత విలు వైన స‌భాస‌మ‌యాన్ని వృథా చేయ‌డమే అవుతుంది. పాడిందేపాట అన్న‌ట్టుగా స‌భ‌లో స‌భ్యులు మాట్లాడుతున్న తీరు.. టీడీపీపై విరుచుకుప‌డుతున్న విధానం ఒకింత ఆవేద‌నను వెలిబుచ్చుతోంది. 


నిజానికి మార్పు కోరుకున్న ప్ర‌జల‌కు, ప్ర‌జాస్వామ్య వాదుల‌కు కూడా ఈ ప‌ద్ధ‌తి మంచిది కాదేమోన‌ని అనిపిస్తోంది. తొలిసభ‌లో జ‌రిగిన పొర‌పాట్లు, అధికార పార్టీ స‌భ్యుల దూకుడు చ‌క్క‌దిద్దేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు అన్ని విష‌యాల్లో ఘోరంగా ఫెయిల్ అయిన‌ట్టే అసెంబ్లీ స‌మావేశాల్లో త‌న మార్క్ లేకుండా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అలాగే చేస్తే ఆ విమ‌ర్శ‌లే ఆయ‌న కూడా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. తొలి స‌భ ఎలా జ‌రిగినా.. వ‌చ్చే నెల జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల నుంచైనా మార్పు క‌నిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌తిఒక్క‌రు కూడా అభిప్రాయ ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: