- ఓటమికి నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనాయా చేయాలని డిమాండ్‌
పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో తమ్ముల్లు  రసాబస చేశారు. పార్టీ ఓటమికి స్థానిక నాయకులే కారణంగా పేర్కొంటూ పెద్ద ఎత్తున వాగ్వివాదానికి దిగారు. నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన కార్యకర్తలు నాయకుల వ్యవహార శైలిని గుర్తుచేసుకుని తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నియోజకవర్గం నుంచి వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు. 


సమావేశం జరుగుతుండగానే కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపించారు. 2019 సాధారణ ఎన్నికలలో వచ్చిన డబ్బుకు జామా ఖర్చు చెప్పాలని పలువురు కార్యకర్తల డిమాండ్ చేశారు. అందుకు ఎవరూ సరైన సమాదానం చెప్పకపోడంతో కార్యకర్తలు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్ధానికుండా తెలుగు దేశం పార్గీ గెలిచేందుకు అవకాశాలున్నప్పటికీ నాయకుల వ్యవహారశైలి ప్రజలలో వ్యతిరేకతను పెంచిందని దుయ్యబట్టారు. 


జిల్లా, నియోజకవర్గ నాయకులు డబ్బు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో రహస్యం చేసిన డబ్బుకు, ఖర్చుచేసిన వ్యయానికి పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశాన్ని రసాబస చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: