పీఠాలన్నిటిలోనూ గొప్ప పీఠమేది అంటే అధికార పీఠం అని ఠక్కున సమాధానం వస్తుంది. పీఠాలు ఎన్ని ఉన్న పవర్ లో ఉండే వారి పీఠమే అతి పెద్ద పవర్ ఫుల్ అని కూడా చెప్పాల్సివస్తుంది. భౌతికపరమైన లోకంలో ఇహమే సత్యం, శివం, సుందరం.


పెందుర్తి శారదాపీఠం స్వామీజీకి రాజకీయ వాసనలు ఉన్నాయని అంతా అంటారు. కానీ ఆయన మరీ ఇంతలా బాహాటంగా పొగడ్తలు చేయడమేంటి అని ఇపుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. కళ్ళు మూసినా తెరచినా అమ్మవారు కనిపించాలి. ఆత్మ అనుసంధానం పరమాత్మతో సాగాలి. కానీ అదేమీ లేకుండా ఆత్మ సాక్షిగా నేను జగన్ని అభిమానిస్తున్నాను, అతడంటే ప్రాణం అని స్వామీజీ చెప్పుకోవడం పట్ల ఆస్తిక జనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన చెందుతున్నారు.


పీఠాలకు ఉన్న గౌరవం ప్రత్యేకత వేరు. అహం విడిచి, ఇహం విడిచి పరం వైపు చూపు సారించాల్సిన పీఠాధిపతులు రాజకీయాల వైపు తొంగి చూడడం అందరిలాగానే వాటి పట్ల వ్యామోహం పెంచుకోవం ఏమాశించి ఇలా పొగడ్తలు కురిపించడం అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి శారదాపీఠం అంతేనే రాజకీయాల మయం అనుకుంటున్న వారికి మరింతగా నిండు సభలో స్వామి చేసిన ప్రసంగంతో కనువిప్పు కలిగిందని అంటున్నారు. పీఠాల పరువు, హిందూ ధర్మం పరువు కూడా ఈ రకమైన చర్యలతో పోతున్నాయని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: