రాజకీయం అంటేనే వ్యూహాలు ఎత్తుగడలు చాలా ఉంటాయి. ఏదీ చూసుకోకుండా అడుగులు వేస్తే తాడే పామై కరుస్తుంది. ఇది చాలా సార్లు రుజువు అయింది కూడా ముక్కుసూటితనం అసలు పనికిరాదు. అలా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడం కూడా తగదు.


మరి జగన్ మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. సీఎం పీఠమెక్కి ఇరవై రోజులు కూడా కాకుండానే హామీల మీద  హామీలతో తెగ జోరు చేస్తున్నారు. వాటి సంగతి సరే. అవన్నీ జగన్ చేతిలో ఉన్నవి. కానీ ప్రత్యేక హోదా అలాంటిది కాదే. అది మోడీ చేతిలోనిది. ఆయన తలచుకుంటేనే ఇచ్చేది. కానీ జగన్ వూరుకోవడం లేదే. పదే పదే లాగుతున్నారు.


కోరి మరీ హోదాతో తల గోక్కుంటున్నారు. దాని ఫలితం ఏంటో చంద్రబాబు చవి చూశారు. జగన్ పోరాటంలో చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టరు కానీ ఫలితం ఆయన చేతుల్లో లేదనేదే అందరి ఆలోచన. హోదా అజెండాగా చేసుకుని జగన్ ముందుకు సాగుతున్నారు. దీనివల్ల అయిదేళ్ళ పాలనలో తొలి రోజుల్లోనే ఇబ్బంది వస్తుందేమోనని కంగారు పడే వారు పార్టీలో ఉన్నారు. మరి జగన్ వ్యూహమేంటో తెలియదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: