ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో పెను సంచలనాలు చూడబోతున్నారంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్రానికి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కాషాయ కండువా కప్పుకొని, తీర్ధం పుచ్చుకోనున్నారని చెప్పుకొచ్చారు. మంగళవారం అనంతపురంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీని దెబ్బ తీయాలని చూసిన టీడీపీకి అసలు సమస్య వచ్చిందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. టీడీపీలో త్వరలో చీలిక రాబోతుందని, చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ అంతమౌతుందన్నారు విష్ణు. ఎన్నికల్లో ఓటమితో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని, రాబోయే కాలంలో ఊహించని విధంగా ఇంకా పెద్ద దెబ్బ తగులుతుందని చిలక జోస్యం చెప్పారు.

ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కొందరు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని విష్ణు తెలిపారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని, సీమకు చెందిన కొన్ని రాజకీయ కుటుంబాలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటున్నారు. రాష్ట్రానికి చెందిన నేతల చేరికపై బీజేపీ అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. 

ఇక మన గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబును తనిఖీ చేశారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.. కానీ చట్టాలకు ఎవరూ అతీతులు కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేమరి, వాడు పదవిలో ఉంటే వీడి మీద, వీడు పదవిలో ఉంటే వాడిమీద విచారణలు చేసుకుంటారేమో!


మరింత సమాచారం తెలుసుకోండి: