ఆంధ్రప్రదేశ్ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మ పేరు ఖరారైందని సమాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ మహిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా బాధ్యతలు నిర్వర్తించిన న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి రాజీనామా చేయ‌డంతో, వాసిరెడ్డి ప‌ద్మ‌కు ఆ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. అయితే మనకింకా పూర్తీ సమాచారం అందవలసి వుంది.

 

ఆమెను రీప్లేస్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటె, కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజకుమారి స్థానంలో.. అదే వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మను నియమించిన జగన్.. తాము కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని పరోక్షంగా సంకేతాలు పంపారని భావిస్తున్నారు. కమ్మ సామజిక వర్గాలలో మరల ఇబ్బందులు రాకూడదని ఇలా చేసుంటారు.

 

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టిన వాసిరెడ్డి పద్మ.. నిత్యం టీడీపీ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడారు. విధేయత, సామాజిక వర్గం కోణంలో ఆమెకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కిందని భావిస్తున్నారు. ఈ విషయమై పద్మగారు మిక్కిలి సంతోషంగా వున్నారని బోగట్టా.

 

చంద్రబాబు హయాంలో మహిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా బాధ్యతలు చేపట్టిన న‌న్న‌ప‌నేని రాజకుమారి తనకు రెండేళ్ల పదవీకాలం ఉన్నందున.. రాజీనామా చేసే యోచన లేదని గతంలో తెలిపారు. సీఎంగా గెలిచిన జగన్‌ను ‘అభినందించడం’ కోసం ఆమె సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. కానీ అప్పటికే జగన్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఆమె సీఎంను కలవకుండానే వెనుదిరిగారు. తనను కొనసాగించే అవకాశాల్లేవని ఆమెకు సంకేతాలు అందడంతో నన్నపనేని పదవికి రాజీనామా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: