బీజేపీ పరిస్థితి ఏపీలో అగమ్య గోచరం. ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి. అలాంటిది ఆ ఆపార్టీ ఇప్పుడు చాలా అతి చేస్తుందని చెప్పాలి. బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతమయ్యేందుకు స్కెచ్‌ రెడీ చేస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళలేని నేతల్ని, తమతో కలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. కామెడీకే పరాకాష్ట ఇది. కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన చాలామంది సీనియర్‌ నేతలు, బీజేపీలో గతంలోనే చేరిపోయారు.


పురంధరీశ్వరి, కావూరి సాంబశివరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలా పెద్దదే. కానీ, వాళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కనీసపాటి ఓటు బ్యాంకు కూడా తీసుకురాలేకపోయారు సరికదా.. బీజేపీ తాజా ఎన్నికల్లో ఆ కాస్త ఓటు బ్యాంకునీ కోల్పోయిందాయె. ఇప్పుడు కొత్తగా టీడీపీ నేతల్ని చేర్చుకుని, బీజేపీ బలపడాలన్న ఆలోచన చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. 

అన్నట్టు, ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బీజేపీ గట్టిగానే కెలుకుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బీజేపీకి ఆత్మహత్యా సదృశ్యమే మరి. ఇకపై బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో తిరగకూడని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పారు. అయినా, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతోంటే, పరిస్థితులు చెయ్యిదాటకుండా ఎలా వుంటాయ్‌.? 

మరింత సమాచారం తెలుసుకోండి: