వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అనేక మార్పులు వస్తున్నాయి. రాయలసీమలో ఇకపై ఎలాంటి భయాలు ఉండవని, అందరు సమానమే అని, తరతరాలుగా వస్తున్న ఫ్యాక్షన్స్ రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు.  దానికి తగ్గట్టుగానే రాయలసీమలో డైనమిక్ ఆఫీసర్స్ ను నియమించారు. 

 

అంతేకాదు, అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ ఓటమి పాలయ్యాక.. సెక్యూరిటీ విషయంలో జగన్ కు లేఖ రాయగా.. వెంటనే ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీని పెంచారు.  ఎవరు తనకు శత్రువులు కారని దీనిద్వారా తెలియజేయడంతో..ఇప్పుడు అందరు సమానమే అని చెప్పకనే చెప్పాడు జగన్.  జగన్ చేసిన మంచిపనికి పరిటాల ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నది. 

 

ఇక తమ ఓటమికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం అని అంటున్నారు. పరిటాల శ్రీరామ్ కు హిందూపురం ఎంపీ లేదంటే.. కళ్యాణదుర్గం, పెనుగొండ రెండింటిలో ఒక అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరారు.  అందుకు బాబు ఒక ఫ్యామిలీలో ఇద్దరికీ కుదరని చెప్పడంతో.. సునీతా తన సీటును వదులుకొని దాని స్థానంలో పరిటాల శ్రీరామ్ ను నిలబెటింది.  సమయం లేకపోవడంతో ప్రచారం చేసుకోలేక ఓటమిపాలయ్యారు. 

 

ఒక ఫ్యామిలీలో ఇద్దరికీ ఇవ్వడం కుదరదు అని చెప్పిన బాబు, జెసి సోదరుల కుటుంబానికి రెండు సీట్లు ఎలా కేటాయిస్తారు.  నారా కుటుంబంలో బాబు తన కుమారుడికి ఎలా సీటు ఇస్తారు.  ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా.  టీడీపీలో తమకు ప్రాధ్యాన్యత లేదని తెలుసుకున్న పరిటాల కుటుంబం ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.  వైకాపాలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: