ఢిల్లీ:  మెట్రో నగరాల్లో ఏటికేడు పెరిగిపోతున్న మురికివాడలను తగ్గించడానికి ఏక గది (సింగిల్‌ రూమ్‌) ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి వీటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఎత్తైన అపార్ట్‌మెంట్లను నిర్మించాలని, ఇందులో కుళాయి ద్వారా నీటి సరఫరా అందుబాటులోకి తేవాలని, ఫ్లాట్‌కు ఒక మరుగుదొడ్డి నిర్మించాలని ప్రతిపాదించింది.

 

ఈ నమూనా కింద కేవలం ప్రభుత్వ సంస్థలే ఇళ్ల నిర్మాణం చేపడతాయి. ‘‘ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన’’ పథకం కింద అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత ఆర్థికసాయం చేయాలని కేంద్ర కార్మికశాఖను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరనుందని అధికారులు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల సహకారంతో లబ్ధిదారులను గుర్తించనుంది.

 

అపార్ట్‌మెంట్ల నిర్మాణం బాధ్యతను ఆయా రాష్ట్రాల హౌసింగ్‌బోర్డులకు అప్పగించనుంది. ఒకవేళ ప్రైవేటు పెట్టుబడిదారుల సహకారంతో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తే కొంత ప్రాంతాన్ని వాణిజ్య ప్రాతిపదికన వారు వినియోగించుకోవచ్చు. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించినప్పటికీ, అద్దెకు ఇచ్చేది మాత్రం రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డులే.

 

ఢిల్లీ లో గల పర్యాటక ప్రదేశాలన్నింటిలో “ఇండీయా గేట్” ప్రముఖమైనది. ఢిల్లీ నగరం నడిబొడ్డున గల 42 అడుగుల ఇండియాగేట్ ఇతర స్థూపాల కంటే ఎత్తులో ఠీవీ గా నిలబడి ఉంటుంది. ఈ  స్థూపాన్ని పారిస్ లో గల “ఆర్చ్-డీ-ట్రయంఫ్” ని పోలిఉండేటట్లు నిర్మించారు. చాల చరిత్రవుంది, కానీ నేడు అత్యధిక కాలుష్యం, పేదరికంతో నిండి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: