రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని తెలుగుదేశంపార్టీ అనుకుంటున్నట్లుంది. తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారో ఏమో ? తాజాగా అసెంబ్లీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం చూస్తే అలాగే అనిపించింది. అందుకనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాజీ మంత్రికి ఫుల్లుగా క్లాస్ పీకాల్సొచ్చంది. అప్పుడు కానీ అచ్చెన్న నోరు మూతపడలేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, అసెంబ్లీలో ప్రత్యేక హోదా విషయంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. సహజంగానే గడచిన ఐదేళ్ళల్లో హోదా విషయంలో చంద్రబాబునాయుడు చేసిన కంపుపై వైసిపి సభ్యులు మండిపడుతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అనుసరించిన వైఖరిని తూర్పారబట్టారు.

 

దాంతో అచ్చెన్న కలగ చేసుకుని జగన్ స్పీచ్ కు పదే పదే అడ్డు తగిలారు. అంతేకాకుండా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ ను ఉద్దేశించి గట్టిగా అరిచారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్ ను ఆదేశించాలంటూ స్పీకర్ ను ఉద్దేశించి కేకలేశారు.

 

దాంతో ఒళ్ళుమండిపోయిన స్పీకర్ అచ్చెన్నకు ఫుల్లుగా క్లాస్ పీకారు. సభలో మాట్లాడే అవకాశం ఎవరికివ్వాలో తనకు ఇంకోరు చెప్పాల్సిన పనిలేదన్నారు. తననే డిక్టేట్ చేసేందుకు ప్రయత్నించొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇది రిపీటైతే బాగోదని గట్టిగా చెప్పటంతో అచ్చెన్న మళ్ళీ ఇంకోసారి నోరిప్పలేదు.

 

టిడిపి అధికారంలో ఉన్నపుడు ఇదే సభలో జగన్ అండ్ కో విషయంలో ఎలా వ్యవహరించింది బహుశా చంద్రబాబుకు అచ్చెన్నకు గుర్తుకొచ్చుంటుంది. జగన్ మాట్లాడేటపుడు పదే పదే మైకులు కట్ చేయటం, జగన్ తిడుతున్న టిడిపి సభ్యులకు ఎటువంటి అంతరాయం లేకుండా మైకులు పనిచేయటం అందరూ చూసే ఉంటారు.

 

బహుశా అదే పద్దతి సభలో కొనసాగాలని అచ్చెన్న వాళ్ళు అనుకున్నారేమో.  ప్రభుత్వం మారిందని ముఖ్యమంత్రిగా జగన్, స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఉన్నారని మరచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నా తామే మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నా తామే మాట్లాడాలన్న అచ్చెన్న, బుచ్చయ్య చౌదరి లాంటి సభ్యుల నోళ్ళకు తమ్మినేని గట్టిగానే తాళం వేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: