తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత జూనియర్ ఎన్టీయార్ టీడీపీ భాద్యతలు తీసుకోవాలని తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. కానీ జేసి దివాకర్ రెడ్డి , పోసాని కృష్ణ మురళి జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. కానీ ఆ అంచనా మాత్రం నూటికి నూరు పాళ్ళు తప్పు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పెనుమార్పులే సృష్టించగలడు. 
 
నిజానికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిననందుకు ఎన్టీయార్ కూడా ఓడిపోతాడేమోనని అంచనా వేయవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 2004 2009 ఎన్నికల్లో పరాజయం పొందినా టీడీపీ 2014లో అధికారం సాధించగలిగింది. టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఓడినా మరలా ఐదేళ్ళలో పరిస్థితి మారే అవకాశం ఉంది. 
 
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్న ఎన్టీయార్ తన మాటలతో ప్రత్యర్థి పార్టీలను భయపడేలా చేసాడు. ఎంతో పరిణతితో జూనియర్ మాట్లాడగలడు. ఎన్టీయార్ ఒకవేళ పార్టీ భాద్యతలు తీసుకుంటే పార్టీని సమర్థవంతంగా నడిపే ఆలోచనా విధానం , పరిణతి జూనియర్ ఎన్టీయార్ కు ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీయార్ అవసరం ఉంది. మరి చంద్రబాబు దీనికి అంగీకరిస్తాడో లేదో మాత్రం చెప్పలేం 



మరింత సమాచారం తెలుసుకోండి: