జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రంలో అవినీతిని.. గూండాయిజాన్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారు.  దానికి తగ్గట్టుగానే అడుగులు కూడా వేస్తున్నారు.  పట్టణాలలో చాలా వరకు అలజడులుగాని, గొడవలు కానీ లేదు.  చాలా ప్రశాంతంగా ఉన్నది.  దీనికి కారణం జగన్ ఇచ్చిన సందేశమే. 

 

ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, గ్రామాల్లో పరిస్థితి వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది.  గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వార్తలు అందుతున్నాయి.  అయితే, ఇది జరుగుతున్నది ఏ రాయలసీమలోనో కాదు.. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు జిల్లాలో.  గుంటూరు జిల్లాలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనిపై బాబుకు కంప్లైంట్ చేశారు. 

 

వీరితో పాటు గురజాల, మాచర్లకు చెందిన కొంతమందిపై కూడా వైకాపా కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, గ్రామాల్లో ఉండలేకపోతున్నామని వాపోతూ బాబుకు కంప్లైంట్ చేశారు.  ఇప్పుడు బాబుకు కంప్లైంట్ చేస్తే ఏం చేయగలుగుతారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దని సంయమనం పాటించమని కార్యకర్తలకు చెప్తున్నారు. 

 

ఏం జరిగినా సైలెంట్ గా ఉండాలని అంటున్నారు.  దీని అర్ధం ఏంటో అర్ధంకాని విధంగా ఉన్నది.  కార్యకర్తలు గ్రామాల్లో దెబ్బలు తింటూ అలా పడి ఉండాల్సిందేనా.. దానిని పట్టించుకోరా.. జగన్ సారూ ప్రాణాలు పోతున్నాయి.. ఓసారి ఇలా చూడండి అని పాపం దెబ్బతిన్న కార్యకర్తలు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: