కాలేజీల్లో ర్యాగింగ్ జరగటం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రాజకీయాల్లో కూడా ర్యాగింగ్ జరుగుతుందని బిజెపి నేతల యవ్వారాలు  చూస్తేనే అర్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో  టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ ఎదురవ్వని ఓటమి టిడిపికి ఎదురైంది.

 

ఎప్పుడైతే టిడిపి పరిస్ధితి ఘోరంగా తయారైందో అప్పటి నుండే బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు. లిటరల్ గా టిడిపిని ర్యాగింగ్ చేసేస్తున్నారు. వీళ్ళ దెబ్బకు చంద్రబాబుకు సరిగా నిద్రకూడా పట్టటం లేదు. టిడిపిలో నుండి వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారంటూ ప్రతీ రోజు లెక్కలు చెబుతున్నారు.

 

టిడిపిలో నుండి బిజెపిలోకి ఎవరెవరు వెళ్ళేవాళ్ళ విషయంలో పూర్తిగా క్లారిటి అయితే లేదనే చెప్పాలి. కానీ కొందరు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో బిజెపి టచ్ లో ఉందనైతే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. దానికితోడు టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు కొందరు నేతలతో బిజెపి టచ్ లో ఉందని చెప్పారు. జేసి ప్రకటనతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది.

 

టిడిపి మాజీ ఎంపి జేసి మాట్లాడూతు తనను బిజెపిలో చేరమని ఆఫర్ వచ్చిందని అయితే తాను ఏమీ తేల్చుకోలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. అదే సమయంలో బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ టిడిపి నుండి కొందరు నేతలు తొందరలోనే తమ పార్టీలో చేరబోతున్నట్లు ఈమధ్య చెప్పారు.

 

దానికి తగ్గట్లే బిజెపి కీలక నేత విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ తొందరలోనే టిడిపి నిలువుగా చీలిపోవటం ఖాయమని చెప్పిన జోస్యం కలకలం రేపింది. చాలామంది టిడిపి నేతలు బిజెపితో టచ్ లో ఉన్నారని సమయం చూసుకుని తమ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్పారు. ఎవరు చెప్పేది నిజమవుతుందో తెలీదు కానీ రోజుకో నేత టిడిపి నేతల గురించి మాట్లాడుతుంటూ చంద్రబాబులో బిపి పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: