పాపం లోకేశ్‌..! ఎర‌గ‌లేక పందిర‌డ్డం.. అన్న చందంగా త‌యారైంది ఆయ‌న ప‌రిస్థితి. తెలుగు భాష రాక‌.. నేర్చుకోలేక‌.. జ‌నాన్ని ఆక‌ట్టుకోలేక‌.. త‌డ‌బ‌డుతూ.. వ‌చ్చీరాని తెలుగుతో త‌గ‌ల‌డుతూ.. ప‌ప్పుగా.. లేదు లేదు గ‌న్నేరు ప‌ప్పుగా ముద్ర‌వేసుకున్నారు. ఆఖ‌రికి తాను పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరును కూడా ప‌ల‌క‌లేక‌పోవ‌డంతో.. జ‌నంలో అభాసుపాల‌య్యారు. మంగ‌ళ‌గిరిని మంద‌ల‌గిరి.. అంటూ న‌వ్వుల‌పాల‌య్యారు. ఆయ‌నకు తెలుగు నేర్పే గురువు పెద్ది రామారావు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డం వ‌ల్లే తెలుగు నేర్చుకోలేక‌పోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా.. లోకేశ్‌బాబుకు కొత్త మాష్టారును వెతికి ప‌నిలో ఉన్నార‌ట‌. పెద్ది రామారావును త‌ప్పించి.. మ‌రొక‌రిని నియ‌మించే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది.


నిజానికి.. చంద్ర‌బాబు త‌న‌యుడిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్‌.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి అడుగుపెట్ట‌కుండానే.. రెండు మూడు మంత్రిప‌ద‌వుల‌ను చేప‌ట్టారు. ఎమ్మెల్సీగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టిన ఆయ‌న జనాన్ని ఏమాత్ర‌మూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. ప్ర‌ధానంగా ఆయ‌న‌కు తెలుగు భాష రాక‌పోవ‌డం పెద్ద‌లోపంగా త‌యారైంది. ప‌దాల‌ను స్ప‌ష్టంగా ప‌ల‌క‌లేరు. ఆయ‌న తెలుగు భాష‌ను నేర్పించేందుకు పెద్ది రామారావును నియమించారు. అయితే.. పెద్ది కూడా లోకేశ్‌ను మంచి వ‌క్త‌గా తీర్చిదిద్దేందుకు ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నం చేశారు. లోకేశ్ పాల్గొనే స‌మావేశాలు, స‌భ‌ల‌కు పెద్ది హాజ‌రై.. ఆయ‌న మాట్లాడే తీరును ప‌రిశీలిస్తూ.. జ‌నం నాడిని తెలుసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగులు దిద్దేవార‌ట‌.


పెద్ది రామారావు ఇన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఏం ఫ‌లితం లేకుండా పోయింద‌నే టాక్ తెలుగు త‌మ్ముళ్ల‌లో వినిపిస్తోంది. నిజానికి.. మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఓడిపోవ‌డానికి.. ఆయ‌న మాట‌తీరేన‌ని ప‌లువురు త‌మ్ముళ్లు లోలోప‌ల చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు.. గురువుగా పెద్ది రామారావును త‌ప్పించి.. మ‌రో కొత్త గురువుతో లోకేశ్‌కు తెలుగు భాష నేర్పించే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు స‌మాచారం. అయినా.. ఎంద‌రు కొత్త మాష్టార్ల‌ను తీసుకొచ్చినా.. లోకేశ్ ప‌రిస్థితి మార‌దులే.. అంటూ.. ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. అయితే.. కొత్త మాష్టారుతోనైనా.. లోకేశ్‌బాబు తెలుగు భాష‌పై ప‌ట్టుసాధిస్తారో లేదో చూడాలంటే.. మ‌రికొంత కాలం ఆగాల్సిందే మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: