ఎంతో సీనియర్ అని చెప్పుకునే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు టిడిపిలో ఒంటరైపోయారు. ఐదేళ్ళ నిర్వాకానికి ఇపుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. సభలో కోడెల అడ్డుగోలుగా వ్యవహరించారు. అంటే చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు స్పీకర్ అలా దిగజారిపోయి వ్యవహరించారనటంలో సందేహమే లేదు. కోడెల వ్యవహారాన్ని రెండు రకాలుగా చూడాలి. మొదటిదేమో అసెంబ్లీలో వ్యవహరించిన తీరు. రెండోదేమో అడ్డుగోలు పనులకు సంతానాన్ని ప్రోత్సహించిన విధానం.

 

చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే సామెత తెలుగులో చాలా పాపులర్. కోడెల అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకు కోడెల శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అయిన వాళ్ళు, కాని వాళ్ళన్న తేడా లేకుండా అందరినీ అడ్డుగోలుగా దోచేసుకున్నారు. దృతరాష్ట్రుని తరహాలో సంతానాన్ని బాగా ప్రోత్సహించారు. సభలో కూడా అడ్డుగోలుగా వ్యవహరించి స్పీకర్ వ్యవస్ధ ప్రతిష్టను నేలబారుకి దిగజార్చేశారు.

 

సరే అదంతా చరిత్రనుకోండి. అధికారంలో ఉన్నపుడు చేసిన దోపిడికి కోడెల కుటుంబంపై వరుసబెట్టి కేసులు నమోదవుతున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపుగా మండిపడింది. కోడెల కుటుంబంపై నమోదవుతున్న కేసులను ఉదాహరణలుగా చెప్పుకుంది. డిజిపిని కలిసి తమ అభ్యంతరాలను చెప్పాలని కూడా సమావేశం నిర్ణయించింది.

 

సీన్ కట్ చేస్తే డిజిపి దగ్గరకు వెళ్ళాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పాల్పడిన అవినీతి మీదే ఇపుడు కేసులు నమోదవుతున్నాయని తీర్మానించుకుంది. కోడెలను సమర్ధిస్తే ఆయన చేసిన అవినీతిని కూడా సమర్ధించినట్లవుతుందని నిర్ణయించుంకుంది పార్టీ. అసలే అనేక అంశాల్లో చంద్రబాబు అండ్ కో ఇపుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. దానికి మీద కోడల వ్యవహారంలో తలదూరిస్తే కష్టాలు ఇంకా పెరుగుతాయని అనుకున్నది.

 

కోడెల కుటుంబ సభ్యుల వ్యవహారాలపై పార్టీలోనే వ్యతిరేకత వచ్చిన విషయాలను పార్టీ నేతలు మాట్లాడుకున్నారు. ఇంతలా బరితెగించి అందరినీ దోచేసుకున్న తర్వాత కేసులు నమోదవటంలో ఆశ్చర్యమేమీ లేదని పార్టీ నేతలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారు. కాబట్టి తనపై నమోదవుతున్న కేసులను కోడెల కుటుంబమే ఎదుర్కోవాలని కూడా పార్టీ తీర్మానించింది. అంటే కోడెలను చంద్రబాబే కాకుండా పార్టీ మొత్తం వదిలేసినట్లుగానే భావించాల్సుంటుంది. అందుకే అన్నారు చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అని.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: