- 16 ఏళ్ళ హర్షవర్ధన్ సింగ్.... అధునాతన డ్రోన్ ను అవిష్కరించాడు
ఎక్కడ పెట్టిన మందుపాతర లనైనా ఇట్టే పసిగట్టి ధ్వంసం చేయగల అధునాతన డ్రోన్ ను 16 ఏళ్ళ హర్షవర్ధన్ సింగ్  అవిష్కరించాడు. ల్యాండ్ మైన్ లను కనిపెట్టి నాశనం చేసే ఒక అద్భుతమైన డ్రోన్ (ఈగల్ A7 )ను తయారు చేశాడు. చిన్ననాటి నుంచి టెక్క్నాలజీ పట్ల మక్కువ కలిగిన హర్షవర్థన్‌ ఏదోకటి కనిపెట్టాలనే తపనతో ఈ సాంకేతిక సాథనాన్ని కనుగొన్నాడు. 


BSF, CRPF, ఆర్మీ, పోలీసు, ఇతర జవాన్ లకు ఎటువంటి ప్రమాదం జరక్కుండా నక్సల్స్ ని గురి చూసి దీనిని  ప్రయోగించ వచ్చు. అనేక దేశాలు దీని పేటెంట్ కోసం పోటీ పడగా..సున్నితంగా తిరస్కరించిన హర్ష వర్ధన్, దీనిని మన దేశం కోసం మాత్రమే కనిపెట్టానని తన దేశంలో మాత్రమే ఉపయోగించాలని  నిర్ణయించానని స్పష్టం చేశాడు.


రక్షణ శాఖకు రక్షణగా నిలిచేందుకు హర్షవర్థన్ ఆలోచన ఎంతగానో దోహదపడిందని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే మేధోపరమైన టెక్కాలనీతో ఆధునిక పరికరాన్ని ఆవిష్కరించిన అతడిని పోలీసులు, రక్షణ,సాయుధ దళాలు వివిధ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: