దిల్లీ: పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ, అమిత్‌షాతో పాటు వివిధ పార్టీల ఎంపీలు సమర్థించారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ తదితరులు సభాస్థానం వరకూ తోడ్కొని వెళ్లగా బిర్లా స్పీకర్‌ స్థానంలో ఆసీనులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు గల్లా జయదేవ్‌, నామా నాగేశ్వరరావు, మిథురెడ్డి తదితరులు సభాపతి స్థానం వద్దకు వెళ్లి బిర్లాకు అభినందనలు తెలిపారు.

 

వ్యాపార వర్గానికి చెందిన 57 ఏళ్ల ఓం బిర్లా అమిత్‌షా, మోదీకి అత్యంత సన్నిహితులు. కోటా-బుందీ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

 

బిర్లా స్వతహాగా వ్యాపార వర్గానికి చెందినవాడు ఐనప్పటికిని, అయన రాజకీయ పరిణితి, న భూతో న భవిష్యతి... అపార చాణుక్యుడిలాంటి అతని మేధో సంపత్తిని చూసి, శ్రీ నరేంద్ర మోడీ ముచ్చటపడి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారు. ఒక్కసారిగా ఏకగ్రీవంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవడంపై ఓం మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: