కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్విటర్‌ ద్వారా బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాహుల్‌గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో పాటు దేవుడు ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ టెక్స్ట్ చేశారు.

 

అటులనే రాహుల్‌ పుట్టినరోజు ను పురస్కరించుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా గతంలో ఆయన దేశ ప్రజలను ఉత్తేజపరుస్తూ చేసిన ఐదు ప్రసంగాలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

రాహుల్‌ ఆత్మీయుడు, రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ స్పిందిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు దేవుడు మెరుగైన భవిష్యత్తుతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌పై ముంబయి కాంగ్రెస్ ప్రశంసల వర్షం కురిపించింది.

 

ఈ ప్రత్యేకమైన రోజు మేం మీకు ఒకటి చెప్పదలచుకున్నాం. నైతిక విలువలు, నీతి కలిగిన నాయకుడిగా ఇప్పటికే మీరు నిరూపించుకున్నారు. దేశం పట్ల, ప్రజల పట్ల మీకున్న నిబద్ధత, అంకితభావం ప్రతిఒక్కరూ ప్రశంసించాల్సిన అంశం అని ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ఇలా పలు రకాలుగా శుభాకాంక్షలు స్వీకరించిన రాహుల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: