Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 7:42 pm IST

Menu &Sections

Search

కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల

కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాలపై గుంటూరు పోలీసులకు  ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాధితులు పోలీసు అధికారులను కలిసి తమని కోడెల కుమారుడు, కూతురు  ఏ విధంగా ఏమార్చి మోసగించారో వివరిస్తూ, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కోడెల కూతురు, కొడుకు అక్రమాలపై  రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలన్న భావన లో ఉన్నట్లు తెలుస్తోంది.


కోడెల తన కూతురు, కొడుకు పాల్పడిన అక్రమాల వల్ల పార్టీ లో ఒంటరివాడయినట్లుగా కన్పిస్తోంది. ఒకవైపు తన కుటుంబం పై పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల  ఆరోపణలు వెల్లువెత్తుతూ, కేసులు నమోదవుతున్న తరుణం లో టీడీపీ రాష్ట్ర నాయకత్వమే కాదు, జిల్లా నాయకత్వం కూడా ఆయన కుటుంబానికి దన్నుగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. కోడెల కుటుంబం పై తొలుత కేసులు నమోదు చేయడాన్ని, జిల్లా పార్టీ నాయకత్వం   తీవ్రంగా వ్యతిరేకించి, తమ నాయకుడి కుటుంబం పై అధికార పార్టీ  కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రజల్లోకి వెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే రోజు, రోజూకి కోడెల కుటుంబ బాధితుల సంఖ్య పెరుగుతుండడం తో వారు కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.


పార్టీ అధికారం లో ఉన్నప్పుడే కోడెల కుటుంబం పై అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయని,ఆనాడే కోడెల తన కొడుకు, కూతురు ని కట్టడి చేసి ఉంటే ఈనాడు , ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది కాదని ప్రయివేట్ సంభాషణల్లో టీడీపీ నేతలే  అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోడెల కుటుంబానికి దన్నుగా వెళితే పార్టీ పరువు బజారున పడడమే కాకుండా, ప్రజలు ఛీత్కరించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే ఈ అంశం పై టీడీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదిపేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేస్తున్నారు. కోడెల కుటుంబం చేసుకున్నాడు చేసుకున్నంత అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది.

 

 


kodela
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.